ఎస్. కోట మండలం పెద్దఖండేపల్లి, బొడ్డవర, ముసిడిపల్లి, రాజీపేట, ఎస్ కోట తదితర గ్రామాల్లో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొన్నీ రోజులుగా పడుతున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు చెరువుల్లోకి భారీగా చేరుతోంది. మండలానికి అతి సమీపంలో చుట్టూ కొండలు ఉండడంతో కొండ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తోంది. కాగా చెరువులు నిండితే ఈ ఏడాది ఖరీఫ్ పంట పండినట్లేనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.