అక్టోబర్ 3 నుండి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. ఈ పరీక్ష జిల్లాలో 5 కేంద్రాల్లో రెండు పూటలా ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు 22, 889 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో టెట్ పరీక్ష ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. అభ్యర్ధులు సందేహాల కోసం 9849739920, 9493313271, 9440941627 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.