దేశాన్ని బిజెపి నుండి రక్షించాలంటూ వినతి

65చూసినవారు
దేశాన్ని బిజెపి నుండి రక్షించాలంటూ వినతి
విజయనగరం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, దేశాన్ని కేంద్రంలో పాలిస్తున్న బిజెపి నుండి రక్షించాలంటూ బుధవారం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం దేశాన్ని విభజించి పాలిస్తుందని డిసిసి అధ్యక్షులు విద్యాసాగర్ ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాలతో రాజకీయం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్