విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం జాతీయరహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అతివేగం కారణంగా అదుపుతపప్పి ఫ్లైఓవర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్తకు తీవ్రగాయాలు కాగా భార్య చనిపోయింది. మృతురాలు నాగసత్యవతి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. భర్తది తమిళనాడుగా ఇద్దరూ ఇషా ఫౌండేషన్లో వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు.