అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

82చూసినవారు
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆర్డీవోలు, తహసిల్దార్లు, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మండల కేంద్రాలలో, ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లు 24/7 పనిచేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్