విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

57చూసినవారు
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్యారేజ్ వద్ద సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్ను దొర, రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకి సమన్యాయం కల్పించిన మహానీయుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ, దుర్గాప్రసాద్, డిపో మేనేజర్ శ్రీనివాసరావు, కార్మిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్