పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన ఉప్పాడ అసిరమ్మ భర్త ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో ఆమె పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ సచివాలయానికి వెళ్లారు. అయితే గత ప్రభుత్వంలో వలంటీర్లు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ చేసిన సమయంలో అసిరమ్మ భర్త పోతయ్యను వేరే ఇంటికి మ్యాపింగ్ చేశారు. దీనివల్ల పింఛన్ మంజూరు చేయలేమని కార్యదర్శి చెప్పడంతో ఆమె కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో తన సమస్యను విన్నవించుకున్నారు. న్యాయం చేయాలని కోరారు. ఎప్పటికి పరిష్కరిస్తారో చూడాలి.