'భోగాపురం విమానాశ్ర‌యాన్ని దేశంలోనే నెం. 1గా తీర్చిదిద్దుతాం'

71చూసినవారు
భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉత్త‌రాంధ్ర‌ అభివృద్దికి దిక్సూచి అని కేంద్ర పౌర విమాన‌యాన శాఖామంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌ నాయుడు పేర్కొన్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం విమానాశ్ర‌య నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన అనంత‌రం, మీడియాతో మాట్లాడారు. భోగాపురం విమానాశ్ర‌య నిర్మాణం పూర్త‌యితే, ఉత్త‌రాంధ్ర రూపురేఖ‌లు మారిపోతాయ‌ని, ఆర్ధికంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుంద‌ని రామ్మోహ‌న్‌ చెప్పారు.

సంబంధిత పోస్ట్