సహజ మరణ బీమా పథకంలో చేరి ఆకస్మికంగా మృతి చెందిన తారాపురం గ్రామానికి చెందిన పొట్టంగి లక్ష్మి వారసులు పొట్టంగి భాస్కరరావుకు స్థానిక ఎస్‌బిఐ బ్రాంచ్ ఆవరణలో మేనేజర్ బెలగాం హరీంద్ర రూ.2లక్షల బీమా పరిహారాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా హరీంద్ర మాట్లాడుతూ పిఎం జీవన జ్యోతి బీమా పథకంలో కేవలం 436 చెల్లించి బీమా పాలసీ తీసుకున్న లక్ష్మి ఈ ఏడాది మార్చిలో మరణించగా వారి వారసులు బీమా వర్తించిందన్నారు.