మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' మూవీ శుక్రవారం (జనవరి 10) వైకుంఠ ఏకాదశి వేళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ దాదాపు ఐదేళ్ల తర్వాత సోలో హీరోగా కనిపించారు. బ్రహ్మానందం విజయనగరం జిల్లా కలెక్టర్‌గా కనిపించారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.