వరద బాధితులకు జిల్లా సమాఖ్య పది లక్షల విరాళం

79చూసినవారు
వరద బాధితులకు జిల్లా సమాఖ్య పది లక్షల విరాళం
విజయవాడ నగరాన్ని ఎన్నడూ లేని రీతిలో ముంచెత్తిన వరదల్లో బాధితులైన ప్రజానీకాన్ని ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకు వచ్చింది విజయనగరం జిల్లా సమాఖ్య. జిల్లా కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ సూచనలతో వరద బాధితులకు రూ. 10 లక్షలు సీఎం సహాయ నిధికి అందజేయాలని నిర్ణయించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్వారా బుధవారం విజయవాడలో సమాఖ్య ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్