గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

68చూసినవారు
గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
గ్రంథాలయోద్యమ నేత జయంతి రామలక్ష్మణమూర్తి జయంతిని పురస్కరించుకొని"గ్రంథాలయాల ఆవశ్యకత"పై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కె. దయానంద్, అబ్దుల్ రవూఫ్ లు తెలిపారు. శనివారం ఎస్. కె. డిగ్రీ కాలేజీలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జులై 1న గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రామలక్ష్మణ మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్