విజయనగరం జిల్లాలో జరగబోయే ప్రతిష్టాత్మక శ్రీ పైడిమాంబ ఉత్సవం ఏర్పాట్లను శాసన సభ్యురాలు పూసపాటి వెంకట విజయలక్ష్మి అథితి గజపతి రాజు మంగళవారం పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్, యస్ పి వకల్ జిందాల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రథం తిరిగే మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.