పుత్సలవీధిలో గల జ్ఞానోదయా విద్యాలయ ప్రాంగణంలో ప్రముఖ కళ్ళ డాక్టర్ మంచు కుమారస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపాలిటి మాజీ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ శిబిరంలో రోగులకు కళ్లను తనిఖీ చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు.