పోలీసు కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు: ఎస్పీ

73చూసినవారు
కండ్లకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు అంధకారమేనని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. పోలీసు సంక్షేమంలో భాగంగా ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కంటి సమస్యలకు ప్రాధమిక స్థాయిలో గుర్తించి, అవసరమైన వైద్యం అందించాలన్నారు. 150మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు విశాఖపట్నం సంధ్య కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్