విజయనగరంలో ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా మంగళవారం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో బాలకృష్ణ వీరాభిమాని తాడ్డి ఆదినారాయణ పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు, డ్రింక్స్ పంపిణీ చేశారు.