గజపతినగరం: చెత్త నుంచి సంపద కేంద్రం పరిశీలన

83చూసినవారు
గజపతినగరం: చెత్త నుంచి సంపద కేంద్రం పరిశీలన
గజపతినగరంలోని చెత్త నుండి సంపద కేంద్రాన్ని జిల్లా సమన్వయకర్త పట్నాయక్, డి. ఎల్. పి. ఓ మోహనరావులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హరిత రాయబార్లకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈవో పి. ఆర్. డి సుగుణాకరరావు, గజపతినగరం పంచాయతీ కార్యనిర్వహణ అధికారి జి జనార్దనరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్