విజయనగరం మండలం గుంకలాం గ్రామం కునుకు వీధిలో శనివారం పల్లకి మీద వినాయక ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు గణపతికి పూజలుచేసి ఆశీర్వచనం తీసుకున్నారు. దీంతో పాటు మహిళలచే సాంస్కృత కోళాట నృత్య ప్రదర్శనలతో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు పెద్ద మొత్తంలో పాల్గోని విజయవంతం చేశారు.