కొత్తపేట: ఘనంగా ముత్యాలమ్మ తీర్థ మహోత్సవము

62చూసినవారు
విజయనగరం జిల్లా కొత్తపేట, కుమ్మరివీధిలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, శ్రీ పోతురాజు స్వామివారి 73వ వార్షిక తీర్థమహోత్సవము గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువ జాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి, ఘటములు ప్రతిష్టించారు. సాయంత్రం మద్ధాల వారి ఇంటి వద్దనుండి అమ్మవారి ఘటములతో చిత్ర విచిత్రమైన వేషములతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్