విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి పండుగకు లక్షలాదిమంది వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్‌కు అంతరాయం, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మూడు రోజులపాటు లేబర్ హాలీడే ప్రకటించాలన్న విషయంపై ఉత్సవ నిర్వహణ కమిటీతో జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ ఛాంబర్‌లో బుధవారం సమీక్షించారు. ఆహార పదార్థాలకు ఇబ్బంది పడకుండా భారీ ఎత్తున ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని సూచించారు.