విజయనగరం బాలాజీ మార్కెట్ వద్ద గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేసి పోస్టర్‌ను విడుదల చేశారు. చిట్టిబాబు, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.