మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి, వారిని చైతన్యపర్చి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సంకల్పం" కార్యక్రమాన్ని భోగాపురం మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం విశాఖ రేంజ్ డిఐజి గోపినాథ్ జెట్టి ప్రారంభించారు. యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, పోలీసు శాఖ 'సంకల్పం' కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.