సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం: జనసేన

72చూసినవారు
సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం: జనసేన
సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదామని జనసేన నాయకులు గురాన అయ్యలు, అవనాపు విక్రమ్, పిలుపునిచ్చారు. పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంగళవారం శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో 'ఓం నమో నారాయణాయ’ మంత్ర పఠనం చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. ప్రజల కోసం పవనుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు.

సంబంధిత పోస్ట్