విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మరో మారు మజ్జి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపారు. కాగా ఈయన ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మజ్జి శ్రీనివాసరావు మరోమారు ఎన్నికైన నేపథ్యంలో జిల్లాలో గల ఆ పార్టీ నాయకులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.