మహాత్మునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

79చూసినవారు
మహాత్మునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
గాంధీ జయంతి సందర్భంగా విజయనగరం ఎన్. సి. ఎస్. వద్ద బుధవారం మహాత్ముని విగ్రహానికి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచుతామనే ప్రతిజ్ఞ చేయించారు. పెద్ద చెరువు వద్ద పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అదితి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్