ప్రజల అభ్యున్నతికి, మండల సమగ్ర అభివృద్ధికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సూచించారు. శనివారం భోగాపురంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో విద్య, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్, వ్యవసాయం, గ్రామీణ మంచినీటి సరఫరా, గృహ నిర్మాణ సంస్థ, మత్స్యశాఖలపై చర్చించారు.