పార్వతీపురం: ని-క్షయ్ మిత్రలుగా ప్రభుత్వ ఉద్యోగుల నమోదు

65చూసినవారు
పార్వతీపురం: ని-క్షయ్ మిత్రలుగా ప్రభుత్వ ఉద్యోగుల నమోదు
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, ఎన్. జి. ఓలు ని-క్షయ్ మిత్ర (దాత) లుగా నమోదుచేసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ పిలుపు నిచ్చారు. వారందరూ టి. బి (క్షయ) బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకొని, వారికి అవసరమైన పోషకాహార మద్దతుతో పాటు మెరుగైన జీవనం కొరకు స్వచ్చందంగా ప్రతి నెలా రూ. 700/-లు చొప్పున ఆరు మాసాల పాటు ఇచ్చేందుకు యోచించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్