పార్వతీపురంలోని యూనియన్ బ్యాంకు సిబ్బంది రైతులకు అందాల్సిన ధాన్యం డబ్బును ఇవ్వడంలేది సిఐటీయు, ప్రజాసంఘాల నాయకులు గొర్లి. వెంకటరమణ, సన్యాసిరావులు ఆరోపించారు. రైతుల ఖాతాలలో ప్రభుత్వం విడుదల చేసిన ధాన్యం డబ్బులు ఉన్నా బ్యాంక్ వారు డబ్బులు ఇచ్చేందుకు నిబంధనలు పెడుతున్నారని తెలిపారు. రోజుకి రూ. 20వేలు మాత్రమే, చెక్కు ఉంటేనె ఇస్తామంటూ చెబుతున్నారన్నారు. దీంతో చదువుకోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.