పేదవారికి అన్నంపెట్టి,వారి ఆకలి తీర్చే అద్భుతమైన కార్యక్రమమే అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా,ప్రకాశం పార్క్ సమీపంలోనూ ఈరెండు చోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ప్రారంభించారు.