మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ పైడిమాంబ సిరిమానోత్సవ సంబరాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. మూడులాంతర్ల వద్ద వున్న చదురుగుడిలో 9.30గంటలకు, రైల్వేస్టేషన్ వద్ద వున్న వనంగుడిలో 11 గంటలకు సాంప్రదాయం ప్రకారం పందిరిరాట ప్రక్రియను నిర్వహించారు. 6గంటల నుంచే భక్తులు పైడిమాంబను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మేయర్ విజయలక్ష్మి, ఆలయ ప్రధాన పూజారి వెంకట్రావుతో పాటు భక్తులు పాల్గొన్నారు.