ఏఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన సౌమ్యలత

77చూసినవారు
ఏఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన సౌమ్యలత
విజయనగరం జిల్లా ఎఎస్పీ (అడ్మిన్) గా సౌమ్యలత మంగళవారం పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎసిబిలో పని చేస్తున్న సౌమ్యలతను విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన సౌమ్యలత జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేయగా, జిల్లా ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్