ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర, విజయనగరం ఉత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ. పైడితల్లి జాతరకు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.