విజయనగరం మండలం సారిక గ్రామంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆదేశాలు మేరకు ఆదివారం ఉదయం స్థానిక సర్పంచ్ బొబ్బాది ఈశ్వర్ రావు, గ్రామపార్టీ అధ్యక్షుడు జి. సురేష్ ఆధ్వర్యంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది.