విజయనగరం మండలం సారిక గ్రామంలో స్వచ్చతా హీ సేవా-24 కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ బొబ్బాది ఈశ్వరరావు ఆద్వర్యంలో ప్రధాన కాలువలో పూడిక తీత పనులు చేపట్టారు. సారిక గ్రామంలో ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్నటు వంటి కాలువలలో పూరికపోయిన పెద్ద ఎత్తున చెత్తను ఆదివారం తొలిగించారు. అదేమాదిరిగా గ్రామంలో అన్ని వీధుల్లోను స్వచ్చతా సేవా హీ 24 కార్యక్రమం చేపట్టారు.