మహాత్మా జ్యోతిభా పూలే 134వ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని పూలే జంక్షన్ వద్ద గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో, పూలే విగ్రహానికి, చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి కూడా నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే జాతికి చేసిన సేవలను కొనియాడారు.