ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంటలకు బీమా రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అనుకోని విపత్తు సంభవించినప్పడు ఈ పథకం రైతులకు ఆదుకుంటుందని చెప్పారు. డిసిసి, డిఎల్ఆర్‌సి సమావేశాలు కలెక్టరేట్లో శనివారం జరిగాయి. వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు లీడ్‌బ్యాంకు, వ్యవసాయశాఖ ప్రచురించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.