జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, వైసిపి నాయకులుతో కలిసి తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన విధ్వంస పాలన పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో 15 వేలు ఇస్తామని చెప్పి 13 వేలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు.