ఎపి మార్కెఫెడ్ విజయనగరం జిల్లా మేనేజర్‌గా ఎన్. వెంకటేశ్వర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు ఉద్యానశాఖలో విధులు నిర్వహిస్తూ, డిప్యుటేషన్‌పై డిఎంగా చేరారు. ఇంతకుముందు ఈ స్థానంలో పనిచేసిన వై. విమలకుమారి మన్యం జిల్లాకు బదిలీపై వెళ్లారు. జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కలిసి అనుమతి తీసుకున్న అనంతరం వెంకటేశ్వర్రావు డిఎంగా బాధ్యతలను స్వీకరించారు.