విజయనగరం జిల్లాలోని 23 సాంఘిక సంక్షేమ వసతిగృహాలను రూ. 4కోట్ల, 67లక్షల, 95వేలతో మరమ్మతు చేయిస్తున్నామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ఈ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, ఆర్అండ్‌బి అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. అన్ని హాస్టళ్లలో కిటీకీలు, తలుపులు బాగుచేయించి, దోమలు రాకుండా మెష్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.