జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 330 సీసీ కెమేరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆదేశించారు. వీటిలో విజయనగరం డివిజన్లో 180, బొబ్బిలి డివిజన్‌లో 60, చీపురుపల్లి డివిజన్‌లో 90 సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన హిట్ అండ్ రన్ కమిటీ సమావేశంలో కొత్తగా 14 అంశాలను ఆమోదించారు.