విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 408 మంది అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షలకు హాజరయ్యారు. 192 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది.