కొత్తపేట, కుమ్మరివీధిలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి మరియు శ్రీ పోతురాజు స్వామివారి 73వ వార్షిక తీర్థమహోత్సవములు మార్చి 9 నుండి 13వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు లక్ష్మణ చార్య, నరసింహ చార్య బుధవారం తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 13వ తేదిన తీర్ధమహోత్సవము, కుంకుమ అర్చనలు, ఘటముల ప్రతిష్టాపన, చిత్ర, విచిత్ర వేషధారణలతో ఊరేగింపు ఉంటుందని భక్తులంతా పాల్గొవాలని కోరారు.