విజయనగరం డిపిఆర్ఓగా, సమాచార శాఖ సహాయ సంచాలకులుగా సుదీర్ఘకాలం పనిచేసి, విశాఖపట్నం బదిలీ అయిన దున్న. రమేష్‌కు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. కలెక్టరేట్లోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. రమేష్ చేసిన సేవలను కొనియాడారు. ఈసందర్బంగా తనకు సహకరించిన ప్రతీఒక్కరికీ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.