విజయనగరం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు

84చూసినవారు
విజయనగరం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ. ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 5 మాసాల్లో 2178 డిడి, 9095 ఓడి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఈ చలానాలను పోలీసు సిబ్బంది విధించారన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్