భారత దేశంలో సిపాయిల తిరుగుబాటుకు ముందు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డితో కలిసి వడ్డే ఓబన్న బ్రిటీష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడారని జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ లో శనివారం వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి, డిఆర్వో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.