విజయనగరం ఏపీఎస్ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 22 వ బ్యాచ్ శిక్షణకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 ఏళ్లు నిండిన వారు డ్రైవింగ్ ట్రైనింగ్‌కు అర్హులు. మరిన్ని వివరాలకు 7382924030, 98666 49336 నెంబర్లు సంప్రదించాలని కోరారు.