విజయనగరం జిల్లాలో కొవిడ్ పరీక్షల కోసం రెండు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆదేశించారు. మంగళవారం ఆయన వైద్యశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నమూనాలను విశాఖపట్నం పంపడం వల్ల జాప్యం జరుగుతుందని చెప్పారు. రాపిడ్ పరీక్షల పరికరాలు సిద్ధం చేయాలని సూచించారు. రాజాం, చీపురుపల్లి ఆసుపత్రుల్లో పెండింగ్ పనులు జులై చివరికి పూర్తి చేయాలని, బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం కేంద్రాల్లో పనులు నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బకాయిల కోసం డీసీహెచ్ఎస్ పద్మజారాణి ముఖ్య కార్యదర్శికి డీవో లేఖ రాయాలన్నారు.