కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు చేపట్టనున్న సంపూర్ణ శిబిరాల నిర్వహణకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ శనివారం తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 15 నుండి 30 వ తేదీ వరకు ధర్తి ఆబా అభియాన్ పేరుతో గిరిజన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.