ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండి సమాజంలో సత్ ప్రవర్తనతో మెలగాలని వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ కోరారు. విజయనగరం పట్టణం స్థానిక తోట పాలెం వద్ద విద్యార్థులకు మాదకద్రవ్యాలు వినియోగం తద్వారా కలిగే నష్టాలు గురించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డిజిటల్ అరెస్ట్ వంటి వాటిని నమ్మవద్దని సూచించారు.