విజయనగరం: వెయిట్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన భవాని

8చూసినవారు
విజయనగరం: వెయిట్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన భవాని
కజకిస్తాన్ దేశంలో జరుగుతున్న ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని తన సత్తా చాటింది. ఈ పోటీల్లో శనివారం పాల్గొన్న ఆమె వరుసగా మూడు బంగారు పతకాలు సాధించినట్లు గ్రామస్తులు తెలిపారు. భవాని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించడంతో భవాని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు, క్రీడాభిమానులు తమ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్